కంటెంట్‌కు వెళ్లు

సృష్టి నిజంగా ఆరు రోజుల్లోనే జరిగిందని యెహోవాసాక్షులు నమ్ముతారా?

సృష్టి నిజంగా ఆరు రోజుల్లోనే జరిగిందని యెహోవాసాక్షులు నమ్ముతారా?

 లేదు. దేవుడు సమస్తాన్ని సృష్టించాడని యెహోవాసాక్షులు నమ్ముతారు. కానీ సృష్టి నిజంగా ఆరు రోజుల్లోనే జరిగిందని మేము నమ్మం. ఎందుకంటే ఆ నమ్మకానికీ, బైబిలు చెప్పేదానికీ పొంతన లేదు. ఈ రెండు ఉదాహరణలు పరిశీలించండి:

  1.   ఆరు సృష్టి దినాల నిడివి. ఆరు సృష్టి దినాలు 24 గంటలు ఉండే మామూలు రోజులని కొందరు వాదిస్తారు. అయితే, “దినం” అని బైబిలు అంటున్నప్పుడు, కొన్నిసార్లు అది ఒక కాల నిడివిని సూచిస్తుంది.—ఆదికాండము 2:4; కీర్తన 90:4.

  2.   భూమి వయసు. సృష్టి నిజంగా ఆరు రోజుల్లో జరిగిందని నమ్మేవాళ్లు, భూమి వయసు కొన్ని వేల సంవత్సరాలు మాత్రమేనని బోధిస్తారు. కానీ ఆరు సృష్టి దినాలకు ముందే మన భూమి, విశ్వం ఉనికిలో ఉన్నాయని బైబిలు చెబుతుంది. (ఆదికాండము 1:1) అందుకే, భూమి వయసు వందల కోట్ల సంవత్సరాలు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు పరిశోధించి చెప్పేదాన్ని యెహోవాసాక్షులు వ్యతిరేకించరు.

యెహోవాసాక్షులు దేవుడు సమస్తాన్ని సృష్టించాడని నమ్మినా, మేము విజ్ఞానశాస్త్రానికి వ్యతిరేకులం కాదు. నిజమైన విజ్ఞానశాస్త్రం, బైబిలు ఎప్పుడూ పొందిక కలిగివుంటాయని మేము నమ్ముతాం.