కంటెంట్‌కు వెళ్లు

మారణహోమం సమయంలో యెహోవాసాక్షులకు ఏమి జరిగింది?

మారణహోమం సమయంలో యెహోవాసాక్షులకు ఏమి జరిగింది?

 మారణహోమం లేదా హోలోకాస్ట్‌ సమయంలో జర్మనీ మరియు నాజీ ఆక్రమించిన దేశాల్లో నివసిస్తున్న 35,000 సాక్షుల్లో దాదాపు 1,500 మంది యెహోవాసాక్షులు మరణించారు. అందరి మరణానికి కారణాలేంటో తెలియలేదు. కానీ ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది కాబట్టి ఆ సంఖ్యలు ఇతర వివరాలు కాలం గడుస్తుండగా బయటికి రావచ్చు.

 వాళ్లు ఎలా చనిపోయారు?

  • నాజీలు ఉపయోగించిన గిల్లొటీన్‌

      మరణశిక్షలు: జర్మనీలో, నాజీ ఆక్రమించిన దేశాల్లో దగ్గరదగ్గరగా 400 మంది సాక్షులకు మరణశిక్ష వేశారు. చాలామంది బాధితుల్ని కోర్టులో విచారణ చేసి, మరణశిక్ష విధించి, తల నరికేశారు. ఇతరుల్ని ఏ చట్టపర కోర్టు విచారణ లేకుండానే కాల్చేశారు లేదా ఉరి తీశారు.

  •   నిర్బంధ శిబిరాల్లో భయంకరమైన పరిస్థితులు: దాదాపు 1,000 కంటే ఎక్కువ మంది సాక్షులు నాజీ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో, జైళ్లలో చనిపోయారు. తీవ్రంగా అలసిపోయేంత కష్టమైన పనులు చేయించడం వల్ల వాళ్లు చనిపోయారు లేదా చిత్రహింసలు, ఆహారం లేక, చలికి తట్టుకోలేక, వ్యాధుల వల్ల లేదా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల చనిపోయారు. మరికొంతమంది అలాంటి పాశవిక విధానం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక విడుదలైన కొంతకాలంలోనే చనిపోయారు.

  •   ఇతర కారణాలు: కొంతమంది సాక్షుల్ని గాస్‌ చాంబర్‌లలో, ప్రమాదకరమైన వైద్య ప్రయోగాలకు గురి చేసి, లేదా ప్రాణాంతకమైన ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారు.

 వాళ్లను ఎందుకు హింసించారు?

 బైబిలు బోధలకు కట్టుబడి ఉన్నందుకు యెహోవాసాక్షుల్ని హింసించారు. నాజీ ప్రభుత్వం బైబిల్లో వద్దన్న వాటిని చేయమని సాక్షుల్ని అడిగినప్పుడు, సాక్షులు వాటిని చేయడానికి ఒప్పుకోలేదు. “లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” అని వాళ్లు నిర్ణయించుకున్నారు. (అపొస్తలుల కార్యాలు 5:29) వాళ్లు అలాంటి నిర్ణయాలు తీసుకున్న రెండు విషయాలు గమనించండి.

  1.   రాజకీయంగా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నేడు అన్ని దేశాల్లో ఉన్న యెహోవాసాక్షుల్లానే, నాజీ పరిపాలనలో జీవించిన యెహోవాసాక్షులు కూడా రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉన్నారు. (యోహాను 18:36) కాబట్టి వాళ్లు వీటిని నిరాకరించారు:

  2.   వాళ్ల నమ్మకాలను పాటించారు. వాళ్ల నమ్మకాలను పాటించకూడదని నిషేధించినప్పటికీ యెహోవాసాక్షులు

 ప్రొఫెసర్‌ రాబర్ట్‌ గర్‌వార్ట్‌ ఇలా చెప్పారు, యెహోవాసాక్షులు “మాత్రమే థర్డ్‌ రైక్‌లో ఉన్నవాళ్లలో మతనమ్మకాలను బట్టి హింసించబడిన వాళ్లు.” a కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో ఉన్న తోటి ఖైదీలు యెహోవాసాక్షులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్లను అభిమానించడం మొదలుపెట్టారు. ఆస్ట్రియాలో ఉన్న ఒక ఖైదీ ఇలా చెప్పాడు: “వాళ్లు యుద్ధానికి వెళ్లరు. వేరేవాళ్లను చంపడంకన్నా వాళ్లే చనిపోతారు.”

 వాళ్లు ఎక్కడ చనిపోయారు?

  •   కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులు: ఎక్కువమంది యెహోవాసాక్షులు కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో చనిపోయారు. వాళ్లను ఆష్‌విట్స్‌, బుచెన్వాల్డ్‌, ఢకావ్‌, ఫ్లాసన్‌బ్యూర్గ్‌, మౌట్‌హౌసన్‌, నోయన్‌గామ్మ, నీడర్‌హాగెన్‌, రావెన్స్‌బ్రూక్‌, సాక్సన్‌హౌజన్‌ క్యాంపుల్లో నిర్బంధించారు. కేవలం సాక్సన్‌హౌజన్‌లోనే దాదాపు 200 మంది యెహోవాసాక్షుల మరణాలను ధృవీకరించారు.

  •   జైళ్లలో: కొంతమంది సాక్షుల్ని జైళ్లలో హింసించి చంపారు. ఇతరులు విచారణ సమయంలో తగిలిన గాయాల వల్ల చనిపోయారు.

  •   మరణశిక్ష వేసిన ప్రదేశాలు: యెహోవాసాక్షులకు ముఖ్యంగా బెర్లిన్‌ ప్లోయెట్‌జెన్‌సీ, బ్రాండెన్‌బర్గ్‌, హాల్లె, సాల్లె జైళ్లలో మరణశిక్ష విధించారు. దాంతోపాటు, యెహోవాసాక్షులకు మరణశిక్ష విధించిన మరో 70 ప్రదేశాలను నమోదు చేశారు.

 కొంతమందికి మరణశిక్ష విధించారు

  •  పేరు: హెలెన గోట్‌హోల్ట్‌

     చంపిన ప్రదేశం: ప్లోయెట్‌జెన్‌సీ (బెర్లిన్‌)

     హెలెన, అనే పెళ్లైన స్త్రీకి ఇద్దరు పిల్లలు, ఆమెను చాలాసార్లు అరెస్ట్‌ చేశారు. 1937లో ఆమెను ఒక విచారణలో ఎంతగా హింసించారంటే ఆమె తన కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకుంది. డిసెంబరు 8, 1944లో ప్లోయెట్‌జెన్‌సీ, బెర్లిన్‌ జైల్లో గిల్లొటీన్‌ అనే శిరశ్చేదన యంత్రం ద్వారా ఆమె తల తీసేశారు.

  •  పేరు: గెఅహార్ట్‌ లీబోల్డ్‌

     చంపిన ప్రదేశం: బ్రాండెన్‌బర్గ్‌

     ఇరవై సంవత్సరాల గెఅహార్ట్‌ను మే 6, 1943లో తల నరికి చంపేశారు, రెండు సంవత్సరాల క్రితం అదే జైల్లో అతని తండ్రిని కూడా తల నరికి చంపేశారు. ఆయన తన వీడ్కోలు ఉత్తరంలో తన కుటుంబానికీ, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇలా రాశాడు: “ప్రభువు శక్తి లేకుండా, నేను ఈ మార్గంలో వెళ్లగలిగేవాడిని కాదు.”

  •  పేరు: రూడోల్ఫ్‌ ఆవ్‌ష్నర్‌

     చంపిన ప్రదేశం: హాల్లె/సాల్లె

     కేవలం 17 సంవత్సరాలున్న రూడోల్ఫ్‌ను సెప్టెంబరు 22, 1944న తల నరికి చంపేశారు. తన తల్లికి రాసిన వీడ్కోలు ఉత్తరంలో అతను ఇలా రాశాడు: “చాలామంది సహోదరులు ఈ మార్గంలో వెళ్లారు, కాబట్టి నేను కూడా వెళ్తాను.”

a హిట్లర్స్‌ హ్యాంగ్‌మాన్‌: ద లైఫ్‌ ఆఫ్‌ హైడ్రిక్‌, 105వ పేజీ.