కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచమంతా గందరగోళం—సురక్షితంగా జీవించడం ఎలా?

ప్రపంచమంతా గందరగోళం—సురక్షితంగా జీవించడం ఎలా?

ప్రపంచంలో ఉన్న పరిస్థితులవల్ల, మీరు ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారా? మీ ప్రాంతంలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా?

  • పోరాటాలు, యుద్ధాలు

  • తీవ్రమైన అంటువ్యాధులు

  • ప్రకృతి విపత్తులు

  • పేదరికం

  • జాతి, కుల, మత భేదాలు

  • నేరాలు

ఏదైనా ఘోరం జరిగినప్పుడు చాలామంది షాక్‌లోకి వెళ్లిపోతారు; ఇక అంతా అయిపోయింది అనుకుంటారు. ఇంకొంతమంది షాక్‌లో ఉండిపోయి ఏడ్వరు, బాధపడరు అలా ఉండిపోతారు అంతే. ఆ రెండూ ప్రమాదమే; వాటివల్ల నష్టమేగానీ లాభం ఉండదు.

అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. మీకిష్టమైనవాళ్లను సురక్షితంగా ఉంచడానికి; మీ ఆరోగ్యాన్ని, మీ సంతోషాన్ని, మీకున్న వాటిని కాపాడుకోవడానికి ఏదోకటి చేయాలి.

ప్రపంచంలో ఉన్న గందరగోళ పరిస్థితులవల్ల ఎక్కువ నష్టపోకూడదంటే, మీరు ఇప్పుడే ఏం చేయాలి?