కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు

3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు

బైబిల్లో . . . “మనలాంటి భావాలు” ఉన్న నమ్మకమైన స్త్రీపురుషుల అనుభవాలు ఉన్నాయి.​—యాకోబు 5:17.

అంటే . . .

ఒకప్పుడు ఇదే భూమ్మీద జీవించిన, మనలాగే రకరకాల ఫీలింగ్స్‌ ఉన్న ఎంతోమంది స్త్రీపురుషుల గురించి బైబిల్లో ఉంది. వాళ్ల గురించి చదువుతున్నప్పుడు, వాళ్లలో ఎవరో ఒకరు అచ్చం మన లాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని అనిపించవచ్చు.

దానివల్ల ఉపయోగం

మన పరిస్థితిని వేరేవాళ్లు అర్థం చేసుకుంటారనే నమ్మకం మనకు ఉండాలి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఇలాంటి నమ్మకం ఉండడం చాలా అవసరం. కొంతమంది గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు వాళ్లకూ మనలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని; వాళ్ల ఆలోచనలు, ఫీలింగ్స్‌ మనలాగే ఉండేవని తెలుసుకుంటాం. మనలాంటి పరిస్థితి వేరేవాళ్లు కూడా అనుభవించారని తెలుసుకున్నప్పుడు ఆందోళనను, డిప్రెషన్‌ను తట్టుకోవడం తేలికౌతుంది.

  • ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో, నిరాశలో ఉన్న కొంతమంది గురించి బైబిల్లో ఉంది. ఇక బ్రతకడం నావల్ల కాదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకప్పుడు జీవించిన మోషేకు, ఏలీయాకు, దావీదుకు అలా అనిపించింది.​—సంఖ్యాకాండం 11:14; 1 రాజులు 19:4; కీర్తన 55:4.

  • బైబిల్లో హన్నా అనే ఒక ఆమె గురించి ఉంది. అసలే పిల్లలు లేరని బాధపడుతుంటే, ఇంకోవైపు అవకాశం చిక్కినప్పుడల్లా ఆమె సవతి దెప్పి పొడుస్తూ ఉండేది. దాంతో హన్నా తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది.​—1 సమూయేలు 1:6, 10.

  • బైబిల్లో యోబు అనే ఆయన గురించి కూడా ఉంది. యోబుకు యెహోవా మీద చాలా విశ్వాసం ఉండేది. కానీ ఒక పెద్ద కష్టం వచ్చి పడినప్పుడు ఆయనకు భరించలేనంత బాధగా అనిపించింది. అప్పుడాయన, “నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది; ఇక బ్రతకాలని లేదు” అన్నాడు.​—యోబు 7:16.

వీళ్లందరూ నెగెటివ్‌ ఆలోచనల నుండి ఎలా బయటపడ్డారో తెలుసుకుంటే, మనం కూడా మన సమస్యల్ని తట్టుకోవడానికి కావల్సిన బలాన్ని పొందుతాం.