కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బోర్‌ కొట్టినప్పుడు ఏం చేయాలి?

బోర్‌ కొట్టినప్పుడు ఏం చేయాలి?

 వర్షం కురుస్తున్న రోజు చేయడానికి ఏమీ లేక, ఎక్కడికీ వెళ్లలేక ఇంట్లోనే ఉండాల్సి వస్తే అంతకన్నా ఘోరమైన విషయం ఏదీ ఉండదని కొంతమంది అనుకుంటారు. రాబర్ట్‌ అనే యువకుడు ఇలా అంటున్నాడు: “అలాంటప్పుడు నేను ఏం చేయాలో తెలీక ఊరికే కూర్చుని ఉంటా.”

 మీకూ ఎప్పుడైనా అలా అనిపించిందా? అలా అయితే, ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది!

 మీరు తెలుసుకోవాల్సినవి

  •   టెక్నాలజీ వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

     టైమ్‌పాస్‌ కోసం ఇంటర్నెట్‌ చూస్తూ ఉండవచ్చు, కానీ దానివల్ల మీరు కొత్తగా ఏమీ చేయలేరు. అప్పుడు మీకు ఇంకా బోర్‌ కొట్టవచ్చు. “ఏమీ ఆలోచించకుండా ఊరికే స్క్రీన్‌ చూస్తూ ఉండిపోతారు” అని 21 ఏళ్ల వయసున్న జెరెమీ చెప్తున్నాడు.

     ఎలీనా అనే అమ్మాయి కూడా ఇలా అంటుంది: “టెక్నాలజీ సహాయంతో మీరు చేయగలిగేది తక్కువే. దానివల్ల నిజమైన లోకం నుండి కాసేపు మీ దృష్టి పక్కకు మళ్లుతుంది. కానీ మీరు ఫోన్‌ లేదా ట్యాబ్‌ లాంటివాటిని ఆపేసిన వెంటనే మళ్లీ మీకు ఇంకా ఎక్కువ బోర్‌ కొడుతుంది.”

  •   వైఖరిని లేదా ఆటిట్యూడ్‌ను మార్చుకోవడం సహాయపడవచ్చు.

     చేయడానికి చాలా పనులు ఉంటే బోర్‌ కొడుతుందా? మీ పని మీకు ఎంత ఇష్టమనే దానిమీదే అది ఆధారపడుతుంది. ఉదాహరణకు, కారెన్‌ అనే అమ్మాయి ఇలా అంటుంది: “స్కూల్లో రోజంతా చేయడానికి చాలా ఉన్నా నాకు బాగా బోర్‌ కొట్టేది. మీరు చేసే వాటి మీద మీకు బాగా ఆసక్తి ఉంటేనే బోర్‌ కొట్టదు.”

 మీకు తెలుసా? చేయడానికి ఏమీ లేకపోవడం ఒక ఆటంకం కాదు, అదొక అవకాశం. ఆ సమయంలో మీరు ఎన్నో కొత్త విషయాలు చేయవచ్చు, నేర్చుకోవచ్చు.

ఖాళీ సమయం సారవంతమైన భూమి లాంటిది, మీరు ఎన్నో కొత్తకొత్త విషయాలు ప్రయత్నించవచ్చు

 మీరు ఏం చేయవచ్చు?

 రకరకాల విషయాల్లో ఆసక్తి చూపించండి. కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోండి. కొత్త హాబీ నేర్చుకోండి. కొత్త విషయాల గురించి పరిశోధన చేయండి. రకరకాల విషయాల మీద ఇష్టం చూపించేవాళ్లకు ఒంటరిగా ఉంటే బోర్‌ అనిపించదు. వాళ్లతో కలిసి ఉండే వాళ్లకు కూడా బోర్‌ కొట్టదు!

 బైబిలు సూత్రం: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము.”​—ప్రసంగి 9:10.

 ఈమధ్య నేను మాండరిన్‌ చైనీస్‌ భాష నేర్చుకోవడం మొదలుపెట్టా, రోజూ ప్రాక్టీసు చేస్తూ నేర్చుకోవడం చాలా బాగుంది. అలా నేర్చుకోవడం ఇన్ని రోజులు మిస్‌ అయ్యాను. ఒక ప్రాజెక్ట్‌ మీద పని చేయడం నాకు చాలా ఇష్టం. నా మనసు బిజీగా ఉంటుంది, సమయాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నాను.”​—మెలిండా.

 మీ లక్ష్యంపై మనసుపెట్టండి. మీరు చేస్తున్న పని వెనకున్న లక్ష్యాన్ని మీరు చూడగలిగితే దానిపై మీ ఆసక్తి పెరుగుతుంది. లక్ష్యంపై మనసుపెడితే హోమ్‌వర్క్‌ కూడా బోర్‌ కొట్టదు.

 బైబిలు సూత్రం: “తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.”​—ప్రసంగి 2:24.

 స్కూల్‌ చివర్లో, నేను ముందు చదువుకోలేదు కాబట్టి ప్రతీరోజు ఎనిమిది గంటలు చదివాను. అప్పుడు నాకు అస్సలు బోర్‌ కొట్టలేదు. ఎందుకంటే నేను నా లక్ష్యంపై మనసుపెట్టాను. ప్రతిఫలం గురించి అంటే గ్రాడ్యుయేషన్‌ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లాను.”​—హానా.

 మీరు మార్చలేనివాటి గురించి ఆలోచించకండి. మీకు బాగా నచ్చిన పనుల్లో కూడా కొన్ని అంశాలు బోరింగ్‌గా ఉంటాయి. కొన్నిసార్లు మీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా చివరిక్షణంలో ప్లాన్‌ కాన్సిల్‌ చేయవచ్చు, అప్పుడు మీకు చేయడానికి ఏ పనీ ఉండకపోవచ్చు. మీ పరిస్థితుల వల్ల నిరుత్సాహపడకుండా, సానుకూలంగా ఆలోచించండి.

 బైబిలు సూత్రం: “సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.”​—సామెతలు 15:15.

 ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆస్వాదించమని నా ఫ్రెండ్‌ నాకు చెప్పింది. నలుగురిలో ఉన్నప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడూ సంతోషంగా ఉండడం నేర్చుకోవడం జీవితంలో చాలా ముఖ్యమని ఆమె చెప్పింది.”​—ఐవీ.