కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్పులు చేసుకునేలా, మంచిగా జీవించేలా దేవుని వాక్యం ఎలా సహాయం చేసిందో వాళ్ల మాటల్లోనే వినండి.

అర్థవంతమైన జీవితం

దేవుని సహాయంతో తిరిగి ఒక్కటయ్యాం

వివాహ బంధంలో వచ్చే సమస్యలతో పోరాడుతున్న ఎవ్వరికైనా సహాయం చేసే శక్తి బైబిలు సూత్రాలకు ఉంది.

జువాన్‌ పాబ్లో జెర్మెనో: యెహోవా నాకు అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చాడు

మనకు ఎదురైన చేదు అనుభవాల్ని మర్చిపోవడం కష్టంగా ఉంటుంది, అవి మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. మరి చిన్నతనంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న జువాన్‌ పాబ్లో, జీవితానికున్న అసలైన అర్థాన్ని ఎలా తెలుసుకున్నాడో, మనశ్శాంతితో ఆనందంగా ఎలా జీవిస్తున్నాడో తెలుసుకోండి.

జానీ, గిడియన్‌: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు

కొన్ని ప్రాంతాల్లో, జాతి వివక్ష సర్వసాధారణం అయిపోయింది. దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఇద్దరు దాన్ని ఎలా తీసేసుకున్నారో తెలుసుకోండి.

ప్రేమ ద్వేషంపై విజయం సాధిస్తుందా?

వివక్షను తీసేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఒక యూదుడు, పాలస్తీనాకు చెందిన వ్యక్తి దాన్ని ఎలా తీసేసుకోగలిగారో తెలుసుకోండి.

బైబిలు ఇచ్చే స్పష్టమైన, సరైన జవాబులు నాకు నచ్చాయి

జీవితం గురించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ఎర్నెస్ట్‌ లోడీ జవాబులు తెలుసుకున్నాడు. బైబిలు ఇచ్చిన స్పష్టమైన జవాబులు ఆయనలో భవిష్యత్తు మీద నిజమైన ఆశను నింపాయి.

నాకు చనిపోవాలని లేదు

ఈవాన్‌క్వారీ ఒకసారి ‘నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?’ అని అనుకుంది. ఆ ప్రశ్నకు జవాబు ఆమె జీవితాన్నే మార్చేసింది.

యెహోవా దేవుడు నా కోసం చాలా చేశాడు

చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యిన క్రిస్టల్కు దేవునికి దగ్గరై తన జీవితానికి ఒక అర్థం కనుక్కోవడానికి ఏ బైబిలు సత్యం సహాయం చేసింది?

నేను పనికిరాని వాడిననే భావన ఇప్పుడు నాలో లేదు

ఇజ్రాయెల్‌ మార్టినజ్‌ తాను పనికిరాని వాడిననే భావన తీసేసుకుని ఆత్మగౌరవాన్ని ఎలా సంపాదించుకున్నాడో తెలుసుకోండి.

చివరికి మా నాన్నకు దగ్గరయ్యాను

రెనే ఎందుకు డ్రగ్స్‌కు, మద్యానికి బానిసయ్యాడో, వాటి నుండి ఎలా బయటపడి మారాడో తెలుసుకోండి.

నేను కూడా సహాయం చేయగలను అని ఇప్పుడు నాకనిపిస్తుంది

హుల్యో కార్యో ఒక ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. దేవుడు పట్టించుకోడు అని అనుకున్నాడు. నిర్గమకాండము 3:7 ఆయన ఆలోచనను మార్చేసింది.

నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని

క్రిస్టాఫ్‌ బౌవర్‌ ఒక చిన్న పడవలో అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బైబిలు చదవడంలో నిమగ్నమయ్యాడు. ఆయన ఏం నేర్చుకున్నాడు?

నేను అన్యాయాన్ని ఎదిరించాలని అనుకున్నాను

అన్యాయాన్ని ఎదిరించడానికి రఫీక ఒక ఉద్యమకారుల గుంపులో చేరింది. కానీ దేవుని రాజ్యం మాత్రమే శాంతిని, న్యాయాన్ని తీసుకొస్తుందని బైబిలు ద్వారా తెలుసుకుంది.

“నేను ఇప్పుడు లోకాన్ని మార్చేయాలని అనుకోవట్లేదు”

సమాజాన్ని మార్చేయాలని అనుకున్న ఒక వ్యక్తికి బైబిలు ఎలా సహాయం చేసింది? ఏది మాత్రమే నిజమైన మార్పు తీసుకురాగలదని ఆయన తెలుసుకున్నాడు?

అసలు దేవుడే లేడని అనుకునేవాణ్ణి

యువకుడిగా ఉన్నప్పుడు దేవుడు లేడనే సిద్ధాంతాన్ని, కమ్యూనిజంని నమ్మిన వ్యక్తి, బైబిల్ని నమ్మడం ఎలా మొదలుపెట్టాడు?

బైబిలు జీవితాల్ని మారుస్తుంది​—2012

పెద్దస్థాయి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం ఉన్న ఒకామె ఎలా నిజమైన సంతోషాన్ని కనుగొంది?

బైబిలు జీవితాలను మారుస్తుంది—ఒకప్పుడు నలుగురు భార్యలు ఉన్న వ్యక్తి మంచి భర్త అయ్యాడు

ఒకప్పుడు నలుగురు భార్యలు ఉన్న అతను పెళ్లి విషయంలో తన ఆలోచనను ఎలా మార్చుకున్నాడు?

నమ్మకాలు మార్చుకున్నారు

బైబిల్లో ఉన్న విషయాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి

మైలీ గుండల్‌ తన తండ్రి చనిపోయినప్పుడు, దేవున్ని నమ్మడం ఆపేసింది. ఆమె నిజమైన విశ్వాసాన్ని, మనశ్శాంతిని ఎలా కనుగొంది?

నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు బైబిలు నుండే జవాబిచ్చారు!

మొదట క్యాథలిక్‌ మఠంలో నన్‌గా, ఆ తర్వాత కమ్యూనిస్టు కార్యకర్తగా సేవచేసిన ఈసోలీనా లామెల్లాకు రెండూ అసంతృప్తినే మిగిల్చాయి. తర్వాత ఆమెకు యెహోవాసాక్షులు పరిచయమయ్యారు. వాళ్లు బైబిలు ఉపయోగించి, తన జీవితానికి నిజమైన అర్థాన్ని కనుగొనేలా ఆమెకు సహాయం చేశారు.

వాళ్లు ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నారు

మేరీకి, బియొన్‌కి సత్యం వేర్వేరు విధాలుగా దొరికింది. సత్యం వాళ్ల జీవితాల్ని ఎలా మార్చేసింది?

మతం మీద నాకు నమ్మకం పోయింది

టామ్‌ దేవున్ని నమ్మాలి అనుకున్నాడు, కానీ అతనికి మతం మీద, అర్థం లేని ఆచారాల మీద నమ్మకం పోయింది. మళ్లీ దేవుని మీద నమ్మకం తిరిగి రావడానికి బైబిలు గురించి నేర్చుకోవడం ఎలా సహాయం చేసింది?

“ఇదే సత్యమని నేను నమ్మకం కుదుర్చుకున్నాను”

లూయీస్‌ ఆలీఫాన్సో మిషనరీ అవ్వాలనుకున్నాడు. బైబిల్ని పరిశీలించడం వల్ల ఆయన లక్ష్యాలు, జీవితం ఎలా మారిపోయాయో తెలుసుకోండి.

డ్రగ్స్, మద్యం

ఒకప్పుడు గొడవలు, కొట్లాటలే నా ప్రపంచం

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఒక యెహోవాసాక్షి మైకేల్‌ కెన్జెలను “ప్రపంచంలో ఉన్న కష్టాలన్నిటికీ కారణం దేవుడని అనుకుంటున్నావా?” అని అడిగాడు. ఆ ప్రశ్న మైకేల్‌ జీవితాన్నే మార్చేసింది.

నా జీవితం దాదాపు అదుపు తప్పిపోయింది

మంచి జీవితం కోసం సాలామానె అమెరికాకు వెళ్లాడు. కానీ మత్తుపదార్థాలకు బానిసై జైలు పాలయ్యాడు. జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి అతనికి ఏది సహాయం చేసింది?

వీధులే నా ఇల్లు

క్రూరునిగా ఉంటూ, డ్రగ్స్‌కు, మందుకు బానిసైన ఆంటోన్యోకు జీవితం శూన్యంలా అనిపించింది. అలాంటి వ్యక్తి ఎలా మారాడు?

నన్ను నేను గౌరవించుకోవడం, స్త్రీలను గౌరవించడం తెలుసుకున్నాను

జోసెఫ్‌ఎరెన్‌బోగెన్‌ బైబిల్లో చదివిన ఒక విషయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి అతనికి సహాయం చేసింది.

“నా జీవిత గమనం గురించి తీవ్రంగా ఆలోచించసాగాను”

దేవునికి నచ్చిన వ్యక్తిగా తయారయ్యేందుకు తన అలవాట్లను, ఆలోచనను మార్చుకోవడానికి ఒక వ్యక్తికి బైబిలు ఎలా సహాయం చేసిందో తెలుసుకోండి.

నా జీవన విధానంతో నాకు విసుగొచ్చేసింది

దిమిత్రి కర్‌షునోవ్‌ తాగుడుకు బానిస, కానీ రోజూ బైబిలు చదవడం మొదలుపెట్టాడు. తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవడానికి ఆయనకు ఏమి సహాయం చేసింది?

“నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది”

పొగాకు వాడకం మానడానికి, మద్యం అతిగా తీసుకోకుండా ఉండడానికి ఒక యువకునికి ఏమి సహాయం చేసిందో తెలుసుకోండి.

నేరం, దౌర్జన్యం

“నా గోతిని నేనే తవ్వుకుంటున్నాను”

ఎల్‌ సాల్వడార్‌లో ముఠా సభ్యునిగా ఉన్న ఈయన ఎలా మారగలిగాడు?

కోపంతో విరుచుకుపడేవాణ్ణి

ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న వ్యక్తి ఇప్పుడు బైబిలు శక్తి వల్లే తాను మారానని నమ్ముతున్నాడు. ఆయన ఇప్పుడు దేవునితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాడు.

ఒకప్పుడు నేను క్రూరంగా ఉండేవాడిని

స్టీవెన్‌ మెక్‌డొవల్‌ చాలా క్రూరమైన స్వభావం గలవాడు. ఆయన చేయని ఒక హత్య, తన జీవితాన్ని మార్చుకునేలా ఆయన్ని పురికొల్పింది.

యెహోవా దయ చూపించే, క్షమించే దేవుడని తెలుసుకున్నాను

నార్మాన్‌ పెల్ట్యే అబద్ధాలు చెప్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఆనందించేవాడు. ఆ ఆనందం ఆయనకు మత్తుమందులా ఉండేది. కానీ బైబిల్లో ఉన్న ఒక వచనం చదివి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు.

నేను తుపాకి లేకుండా అడుగు బయటపెట్టేవాణ్ణే కాదు

ఒకప్పుడు ఆనన్‌జీయాటో లూగారా పేరుమోసిన ముఠా సభ్యుడు. ఒకరోజు రాజ్యమందిరంలో జరిగిన బైబిలు కూటానికి వెళ్లాడు. అది ఆయన జీవితాన్ని మార్చేసింది.

“నన్ను చాలామంది ఈసడించుకునేవాళ్లు”

క్రూరుడైన ఒక వ్యక్తి, బైబిలు సత్యాలు నేర్చుకోవడం వల్ల శాంతస్వభావునిగా మారిన వైనం గురించి తెలుసుకోండి.

క్రీడలు, సంగీతం, వినోదం

జేసన్‌ వోల్డ్స్‌: మీరు యెహోవాని సేవిస్తే ఎప్పుడూ విజయం సాధిస్తారు

యెహోవాకి నచ్చింది చేయడం మీదే మనసుపెడితే, మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం.

జీవితంలో నాకు ఏదీ తక్కువ కాలేదని అనిపించింది

స్టేఫాన్‌, యౌవనంలోనే మంచి పేరు సంపాదించిన మ్యుజీషియన్‌. అతని దగ్గర అన్నీ ఉన్నట్టు అనిపించినా, ఏదో తెలియని వెలితి ఆయన్ని బాధించేది. మరి జీవితంలో నిజమైన సంతోషాన్ని, జీవితానికి ఒక అర్థాన్ని ఆయన ఎలా కనుగొన్నాడు?

నా జీవితంలో పొందిన అత్యుత్తమ బహుమతి

ఒక టెన్నిస్‌ క్రీడాకారుడిని బైబిలు ప్రచారకునిగా మార్చినది ఏంటి?

గెలిచే ముందు నేను చాలాసార్లు ఓడిపోయాను

ఒకతను ఎలా అశ్లీల చిత్రాలు చూసే అలవాటును వదిలించుకొని బైబిలు వాగ్దానం చేస్తున్న మనశ్శాంతిని పొందాడు?

“నేను మొరటుగా ప్రవర్తించేవాణ్ణి”

ఎసా సంగీత పరిశ్రమలో ఎత్తుకి ఎదుగుతున్నా, తన జీవితానికి ఒక అర్థమంటూ లేదని తనకు తెలుసు. హెవీమెటల్‌ సంగీతాన్ని వాయించే ఈ వ్యక్తి నిజమైన సంతోషాన్ని ఎలా పొందాడో తెలుసుకోండి.

ఒకప్పుడు బేస్‌బాల్‌ ఆడడం అంటే నాకు ప్రాణం!

శామ్యూల్‌ హామిల్టన్‌కి ఆటలంటే పిచ్చి, కానీ బైబిలు స్టడీ ఆయన జీవితాన్ని మార్చేసింది.

“పరదైసు గురించిన వాగ్దానం నా జీవితాన్నే మార్చేసింది!”

ఐవార్స్‌ వైగ్యులిస్‌ జీవితం పేరుప్రఖ్యాతలు, గౌరవం, థ్రిల్‌ చుట్టూ తిరిగేది. బైబిలు సత్యాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపించాయి?