కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే . . .

ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలి?

ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలి?

ఇంట్లో శాంతిని కాపాడుకోవడానికి బైబిలు సహాయం చేస్తుందని మీకు అనిపిస్తుందా? కొంతమందికి సహాయం చేసిన విషయాలను ఇక్కడ చెప్తున్నారు. వాటిని బైబిలు చెప్తున్న మాటలతో పోల్చి చూడండి. గొడవలు రాకుండా ఉండడానికి, శాంతిగా ఉండడానికి, బంధాల్ని బలపర్చుకోవడానికి వీటిలో మీకు ఏవి సహాయం చేస్తాయో చూడండి.

శాంతిని తీసుకొచ్చే కొన్ని బైబిలు విషయాలు

ఒకరి గురించి ఒకరు మంచిగా ఆలోచించండి.

“కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”ఫిలిప్పీయులు 2:3, 4.

“భార్యని లేదా భర్తని మనకన్నా, వేరే వాళ్లకన్నా ముఖ్యమైన వాళ్లుగా చూస్తే చాలా మంచిదని మాకు అర్థమైంది.” —చ. పి. (పెళ్లై 19 సంవత్సరాలైంది).

మనసులో ముందే ఒక నిర్ణయానికి రాకుండా జాగ్రత్తగా వినండి.

“మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, . . . , జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.”తీతు 3:1, 2.

“పోట్లాడినట్లు కాకుండా నెమ్మదిగా సమాధానమిస్తే చాలా వరకు సమస్యను తగ్గించుకోవచ్చు. దురభిప్రాయాలు పెట్టుకోకుండా, అవతలి వాళ్లు చెప్పింది మనకు నచ్చకపోయినా వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తూ వినడం చాలా ముఖ్యం.”—పి. పి. (పెళ్లై 20 సంవత్సరాలైంది).

సహనంగా నెమ్మదిగా ఉండడం అలవాటు చేసుకోండి.

“దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.” సామెతలు 25:15.

“గొడవలు వస్తుంటాయి, కానీ చివరికి ఏమి జరుగుతుంది అనేది మన ప్రవర్తన లేదా లక్షణాలను బట్టే ఉంటుంది. మనం చాలా సహనంతో ఉండాలి. అలా ఉంటేనే సమస్యలు పరిష్కారమౌతాయని చూస్తాం.” —జి. ఎ. (పెళ్లై 27 సంవత్సరాలైంది).

తిట్టుకునే లేదా కొట్టుకునే పరిస్థితికి దిగజారిపోకండి.

“కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.”కొలొస్సయులు 3:8.

“నా భర్త చూపించే సహనం నాకు చాలా నచ్చుతుంది. ఆయన ఎప్పుడూ నెమ్మదిగా ఉంటారు, నా మీద అరవరు, నన్ను అవమానించరు.”—బి. డి. (పెళ్లై 20 సంవత్సరాలైంది).

త్వరగా క్షమించడానికి, మనస్పర్థల్ని త్వరగా పరిష్కరించుకోవడానికి ముందుండండి.

“ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”కొలొస్సయులు 3:13.

“విసుగు చిరాకులో ఉన్నప్పుడు ప్రతిసారీ నెమ్మదిగా ఉండడం సులువు కాదు, ఏదో మాటలతో, పనులతో మన భర్తని గానీ భార్యని గానీ బాధపెట్టేస్తాం. అలాంటప్పుడు క్షమించడంలోనే అందం ఉంది. క్షమాపణ లేకుండా మంచి వివాహం అసాధ్యం.”—ఎ. బి. (పెళ్లై 34 సంవత్సరాలైంది).

నిస్వార్థంగా ఇచ్చిపుచ్చుకోవడం అలవాటు చేసుకోండి.

“ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; . . . మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.”లూకా 6:38.

“నాకు ఏమి ఇష్టమో నా భర్తకు తెలుసు, ఎప్పుడూ నా కోసం ఏదో ఒకటి కొత్తగా చేస్తూనే ఉంటారు. అప్పుడు, ‘నేనేమి చేసి ఆయన్ని సంతోషపెట్టవచ్చు?’ అని ఆలోచిస్తాను. అలా చేసి ఎన్నోసార్లు నవ్వుకున్నాం, ఇంకా అలానే సంతోషంగా ఉంటున్నాం.” —హెచ్‌. కె. (పెళ్లై 44 సంవత్సరాలైంది).

ఇంట్లో శాంతిని కాపాడడానికి ప్రయత్నించడం మానకండి

తేజరిల్లు! ఇంటర్వ్యూ చేసిన వీళ్లంతా ప్రపంచంలో ఉన్నవాళ్లలో కొంతమందే. మంచి లక్షణాలు చూపించేలా బైబిలు ఎంతోమందికి సహాయం చేసింది. ఆ సహాయంతో వాళ్లు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారు. a ఇంట్లో ఉన్నవాళ్లందరూ సహకరిస్తున్నట్లు అనిపించకపోయినా, శాంతిని కాపాడడానికి కష్టపడడం ఎప్పుడూ ప్రయోజనాలు తెస్తుందని వాళ్లు తెలుసుకున్నారు. ఎందుకంటే బైబిలు ఇలా మాటిస్తుంది: “సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు.”—సామెతలు 12:20. ◼ (g15-E 12)

a కుటుంబ జీవితం సంతోషంగా ఉండడానికి ఏమి చేయాలనే దాని గురించి ఎక్కువ సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో 14వ అధ్యాయం చూడండి. ఈ పుస్తకం www.mt711.comలో ఉంది. బైబిలు బోధలు > కుటుంబం కోసం అనే భాగం కూడా చూడండి.