కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే . . .

కుటుంబంలో గొడవలు​—⁠ఎలా మొదలౌతాయి?

కుటుంబంలో గొడవలు​—⁠ఎలా మొదలౌతాయి?

“మేము ఎక్కువగా డబ్బు విషయాల్లో గొడవపడతాం” అని ఘానా దేశంలో ఉంటున్న సేర a అంటుంది. ఆమెకు జేకబ్‌తో పెళ్లై 17 సంవత్సరాలైంది. ఆమె ఇలా చెప్తుంది, “నేను కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తాను. జేకబ్‌ అస్సలు డబ్బు విషయాల గురించి నాతో మాట్లాడడు కాబట్టి, నాకు కోపం వస్తుంది. మేము ఒకరితో ఒకరం కొన్ని వారాలు మాట్లాడుకోము.”

“అది నిజమే,” అని ఆమె భర్త జేకబ్‌ అంటున్నాడు. “కొన్నిసార్లు మేము బాగా తిట్టుకుంటాం. ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల, సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. కొన్ని పరిస్థితుల్లో అనవసరంగా ఆవేశపడడం వల్ల కూడా పోట్లాటలు వస్తాయి.”

భారత దేశంలో ఉంటున్న రాహుల్‌కు కొత్తగా పెళ్లైంది. ఒకరోజు వాళ్ల మామగారు అత్తగారి మీద అరిచాడు. రాహుల్‌ ఇలా చెప్తున్నాడు: “ఆమె బాధపడి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అప్పుడు నేను ఎందుకు అలా అరిచారు, అని మా మామగారిని అడిగినప్పుడు, నేను ఆయన్ని అవమానిస్తున్నట్లు అనుకుని, వెంటనే ఇంక అందరి మీద అరవడం మొదలుపెట్టాడు.”

కొన్నిసార్లు అనుకోకుండా అయినా, కోపంలో అయినా కఠినంగా అన్న మాటలు ఇంట్లో ఎలా గొడవలు తెస్తాయో మీరూ గమనించే ఉంటారు. ఒకరి అభిప్రాయాల గురించి ఒకరు నెమ్మదిగా మాట్లాడుకుంటూ మొదలుపెట్టినా తర్వాత మాటామాటా పెరిగి పోట్లాటలా మారిపోవచ్చు. ఎప్పుడూ సరిగ్గా మాట్లాడడం ఎవరికైనా కష్టమే. కాబట్టి ఎవరైన అన్న మాటల్ని గానీ వాళ్ల ఉద్దేశాల్ని గానీ వెంటనే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ గొడవపడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.

కోపంగా ఒకరినొకరు అరచుకుంటున్నట్లు అనిపించగానే ఏం చేయవచ్చు? మీ కుటుంబంలో పరిస్థితుల్ని మళ్లీ ప్రశాంతంగా, నెమ్మదిగా మార్చడానికి మీరు ఏం చేయవచ్చు? ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఎలా ఉంచుకోవచ్చు? చదివి చూడండి. (g15-E 12)

a కొన్ని అసలు పేర్లు కావు.